సదాశివపేట రూరల్(సంగారెడ్డి): నందికంది శివారులోని బ్లూ క్రాఫ్ట్ అగ్రో కాలుష్య పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం పరిశ్రమ వద్ద ధర్నా, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, నాయకులు మాట్లాడారు. పరిశ్రమ వదిలిన వ్యర్థాలతో జల, వాయు కాలుష్యం ఏర్పడుతుందన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలుష్య జలాలతో పశువులు మృతి చెందుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. కాలుష్య కారక పరిశ్రమను తనిఖీలు చేయని పీసీబీ అధికారులపై కూడా చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, శివరాం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


