ఐస్‌క్రీమ్‌ తిని యువకులకు వాంతులు | - | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌ తిని యువకులకు వాంతులు

Jun 23 2026 7:49 AM | Updated on Jun 23 2026 7:49 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): ఐస్‌క్రీమ్‌ తిని ఇద్దరు యువకులు వాంతులు చేసుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని సికింద్లాపూర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... ఎక్సెల్‌పై ఐస్‌క్రీమ్‌ విక్రయించే వ్యక్తి రావడంతో గ్రామానికి చెందిన యువకులు శివ, నాగరాజు కొనుగోలు చేసి తింటుండగా దుర్వాసన వచ్చింది. దీంతో ఐస్‌క్రీమ్‌ డబ్బాతో పాటు విక్రయదారుడిని పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి 100కు డయల్‌ చేశారు. యూపీకి చెందిన ఐస్‌క్రీమ్‌ అమ్మకం దారుడు వినోద్‌ని గ్రామస్తులు ప్రశ్నించగా తాను మియాపూర్‌లోని హన్స్‌ డెయిరీ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు చెప్పాడు. ఐస్‌క్రీమ్‌పై గడువు ముగిసే తేదీ లేదు. కాలం చెల్లిన ఐస్‌క్రీమ్‌ తినడం వల్ల వాంతులు చేసుకున్నామని యువకులు శివ, నాగరాజు వాపోయారు. పోలీసులు కల్పించుకొని సంబంధిత పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు గ్రామస్తులచే ఫిర్యాదు చేయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement