సంగారెడ్డి సంజీవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు సరిపోకపోవటంతో కొత్త భవనానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా పిల్లర్ల దశలోనే ఉంది. దీంతో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు రెండు గదుల్లోనేకూర్చుంటున్నారు. దీంతో అందరికీ ఇరుకుగా మారి ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎక్కడా నిలువనీడ లేకపోవటంతో ఎండలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వర్షాలు పడితే మాత్రం వారింకా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిర్మాణం త్వరగా అయ్యేలా చూడాలని విద్యార్థులుతల్లిదండ్రులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి


