జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పార్టీ సానుభూతి పరుల ఓట్లు అక్రమంగా తొలగించే అవకాశం ఉందని, ఓటు చోరీ ప్రయత్నాలు జరిగితే ఎన్నికల అధికారుల దృష్టికి తేవాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ సూచించారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలో సర్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు అయ్యిందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా అక్రమంగా ఓట్లను తొలగించడం, నకిలీ ఓట్లను చేర్చడం లాంటి ప్రయత్నాలు జరిగితే వెంటనే స్పందించాలని చెప్పారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, ఐడీసీ చైర్మన్ నిర్మలారెడ్డి, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ యూనూస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్ అజ్మత్ ఉల్లా, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, సీడీసీ చైర్మన్ ముబీన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్


