అర్హులైన వారు ఓటరుగా నమోదవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులైన వారు ఓటరుగా నమోదవ్వాలి

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

అర్హులైన వారు ఓటరుగా నమోదవ్వాలి

జోగిపేట(అందోల్‌): అర్హులైన ప్రతీ ఒక్క పౌరుడు ఓటరుగా నమోదయ్యేలా బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఆందోల్‌ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంపై ఆందోల్‌, వట్‌పల్లి, పుల్కల్‌, చౌటకూరు మండలాలకు చెందిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్స్‌ (బీఎల్‌ఏ)లతో మంత్రి సంగారెడ్డిలోని తన నివాసంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి సవరణలు చేపట్టేందుకు కృషి చేయాలని, అర్హులైన ఓటరు ఓటర్ల జాబితా నుంచి తొలగింపు లేకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమన్నారు. ప్రతీ ఓటరు తమ ఓటు హక్కుపై అవగాహన పెంపొందించే దిశగా బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆందోల్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

జర్నలిస్ట్‌ భూమయ్యను పరామర్శించిన మంత్రి

సికింద్రాబాద్‌–బోయినపల్లిలోని హెకా రిహబ్‌ సెంటర్‌లో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై చికిత్స పొందుతున్న ఆందోల్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు, సీనియర్‌ పాత్రికేయుడు కనకంటి భూమయ్యను ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. భూమయ్యకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.

బూత్‌ లెవెల్‌ ఏజెంట్లతో

మంత్రి దామోదర రాజనర్సింహ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement