ఇంటర్ పూర్తి చేసి ఈఏపీసెట్ క్వాలిపై అయిన విద్యార్థులు ఈనెల 28 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి తేదీ, సమయం ఎంపిక చేసుకొని ముందుగా కౌన్సెలింగ్ కోసం స్లాట్‌బుక్ చేసుకోవాలి.
22 నుంచి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కాగానే విద్యార్థులకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డు అందజేస్తారు.
25 నుంచి జులై 1 వరకు కళాశాలలకు ఆప్షన్లు పెట్టుకోవాలి. అదే రోజు ఆప్షన్లను ఫ్రీజ్ చేస్తారు.
జులై 4 నుంచి మాక్‌సెట్ అలాట్‌మెంట్ పూర్తి కాగానే విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లలో ఏ కళాశాలలో సీటు పొందే అవకాశం ఉందో తెలుస్తుంది.
5 నుంచి 7 వరకు కళాశాల మార్పులు, చేర్పులు, కొత్త ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.
10న మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి కాగానే 14 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ తీసుకోవాలి.
మొదటి దశ కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులకు రెండవ కౌన్సెలింగ్ కోసం 17న స్లాట్‌బుక్ చేసుకోవచ్చు.
18, 19న రెండవ విడత కౌన్సెలింగ్ నిర్వహించి 22న సీట్లు కేటాయిస్తారు. 25 నుంచి 28 వరకు ఫీజు చెల్లించి కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
మొదటి, రెండో దశ కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు చివరి కౌన్సెలింగ్‌కు 31న స్లాట్‌బుక్ చేసుకోవచ్చు.
ఆగస్టు 1, 2న చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 5న సీట్ల కేటాయింపు, 7 వరకు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ అందజేయాలి.
16న స్పాట్ అడ్మిషన్లతో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ పూర్తవుతుంది.
జిల్లాకు రెండు కౌన్సెలింగ్ సెంటర్లు
మొట్టమొదటి సారిగా హుస్నాబాద్‌లో..
అవగాహన లేక
స్లాట్ బుక్ చేసుకోని విద్యార్థులు
నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం కోసం సోమవారం నుంచి ఐదు రోజుల పాటు టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాకు ఒక సెంటర్ చొప్పున సిద్దిపేటలోని రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలకు కౌన్సెలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌలభ్యం కోసం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రస్తుతం హుస్నాబాద్‌లో కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. సోమవారం నుంచి స్థానిక శాతవాహన యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 19 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కావడంతో మొదటి రోజు కౌన్సెలింగ్‌కు రాజగోపాల్‌పేట కళాశాలకు 428 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా హుస్నాబాద్‌కు సెంటర్ కేటాయించిన విషయం తెలియకపోవడంతో 42 మంది విద్యార్థులు మాత్రమే స్లాట్‌బుక్ చేసుకున్నట్లు తెలిసింది.
ముందుగా స్లాట్ బుకింగ్..
తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు
విద్యార్థుల ఈఏపీసెట్ ర్యాంకుకార్డు, హాల్‌టికెట్, ఆధార్‌కార్డు, పదవ తరగతి, ఇంటర్ మార్కుల మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ బోనఫైడ్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఓసీ విద్యార్థులు 2026లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లాలి. అలాగే అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీ, ఓటీపీ కోసం మొబైల్ వెంట తీసుకెళ్లాలి.
నేటి నుంచి ఐదు రోజులు ధ్రువపత్రాల పరిశీలన


