వేపకు ఏమైంది! | - | Sakshi
Sakshi News home page

వేపకు ఏమైంది!

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

● కనిపించని పూత, కాత ● వేప గింజల కొరత

● కనిపించని పూత, కాత ● వేప గింజల కొరత

జహీరాబాద్‌ టౌన్‌: ఆయుర్వేదంలో వేప చెట్టును సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. వేప ఆకు, పూత, కాత ఇలా చెట్టు నుంచి వచ్చే ప్రతిది ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌తో పాటు రోగ నిరోధక శక్తి పెంచుతూ మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. మొన్నటి వరకు మునుపెన్నడూ లేని విధంగా ఒకటి రెండు కాదు..ఊర్లు, పట్టణాలు, పొలం గట్లపై ఎక్కడ చూసినా ఎండిపోయిన వేపచెట్లు దర్శనమిచ్చాయి. ఉగాది పర్వదినం నాటికి వేప చెట్లు మళ్లీ జీవం పోసుకున్నాయి. పచ్చని ఆకులతో చెట్లకు పూర్వ వైభవం వచ్చింది. కానీ జూన్‌ నెల వచ్చినా చెట్లకు కనిపించాల్సిన కాత రాలేదు. ఈ సారి వేప పువ్వు లేకుండానే ఉగాది పచ్చడిని చేసిన విషయం తెలిసిందే. వేప గింజల నుంచి కషాయాలు, పిండి, నూనె, సబ్బులు, పేస్టులతో పాటు చర్మ సంబంధిత ఔషధాలను తయారీ చేస్తారు. ఈ సారి చెట్లకు కాత లేకపోవడంతో గింజల కొరత నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement