ఒత్తిడిని తగ్గించే ఔషధం ‘యోగా’ | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని తగ్గించే ఔషధం ‘యోగా’

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల ను నిర్వహించే పోలీసు సిబ్బందికి యోగా అద్భుతమైన ఔషధమని సిద్దిపేట సీపీ సాధన రష్మీ పెరు మాళ్‌ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. సీపీ, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన పోలీస్‌ బలగమే సురక్షితమైన సమాజానికి పునాది అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏఆర్‌ సుభాస్‌ చంద్రబోస్‌, ఏసీపీలు, సీఐలు మహేందర్‌రెడ్డి, మురళి, లక్ష్మీబాబు, విద్యాసాగర్‌, వాసుదేవరావు, ముత్యంరాజు, దుర్గ, ఎస్‌ఐలు కరుణాకర్‌రెడ్డి, రాజేశ్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement