మహబూబ్
సాగర్
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ చెరువు (మహబూబ్ సాగర్)ను రూ.500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అన్ని హంగులతో మహబూబ్‌సాగర్ చెరువును అభివృద్ధి చేసేలా చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. కిలోమీటరున్నర పొడవున ఉన్న చెరువు కట్టను అభివృద్ధి చేయడంతోపాటు, నెక్లెస్‌రోడ్, పార్కులు ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు. సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలతోపాటు, హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ఆహ్లాదం పంచేలా కింది బజార్ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కింది బజార్ చెరువు కట్ట పనులకు శంకుస్థాపన చేసేలా పనుల్లో వేగం పెంచాలని, అవసరమైన అన్ని ప్రతిపాదనలు పూర్తి చేయాలని జగ్గారెడ్డి అధికారులకు సూచించారు.
సర్వాంగ సుందరంగాతీర్చిదిద్దేలా ప్రణాళికలు
త్వరలో పనులకు శంకుస్థాపనచేయనున్న సీఎం రేవంత్
అధికారులతో జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష
చెరువును పరిశీలించిన
జగ్గారెడ్డి, నిర్మల దంపతులు
అఽదికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం జగ్గారెడ్డి, నిర్మల సంబంధిత అధికారులతో కలిసి కింది బజార్ చెరువు కట్ట వద్దకు వెళ్లారు. అలుగు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. వారి వెంట నాయకులు అనంతకిషన్ ,కూన సంతోశ్, కిరణ్‌గౌడ్ తదితరులున్నారు.


