మెనూ ప్రకారం భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెనూ ప్రకారం భోజనం అందించాలి

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

కలెక్టర్‌ హైమావతి

కలెక్టర్‌ హైమావతి

కొండపాక(గజ్వేల్‌): పాఠశాలల్లో మెరుగైన చదువు తో పాటు రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. కొండపాకలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం తీరు, వసతు లు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన బోధన అందుతు న్నాయన్న విషయాన్ని ఉపాధ్యాయులు విరివిగా ప్రచారం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. నాసిరకం కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే హెచ్‌ఎంలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement