పాపన్నపేట(మెదక్): మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన రఘుపతి పోచయ్య, ఇందిర దంపతులకు కీర్తన, అశ్రుత, నవదీప్ సంతానం. పొద్దున్నే లేచి, నదికి వెళ్లి చేపలు పట్టుకొచ్చి అమ్మితే గానీ పూట గడవని పరిస్థితి. చిన్నప్పటి నుంచి సెలవు దినాల్లో తండ్రితో పాటు చేపల వేటకు వెళ్లేది అశ్రుత. అక్కడ చేపలు పట్టడంలో తండ్రి నుంచి మెలకువలు నేర్చుకుంది. వాటిని తన కిష్టమైన కబడ్డీ ఆటకు అన్వయించుకునేది. అలా కబడ్డీ విభాగంలో తదితర జిల్లా, జూనియర్స్, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడి సత్తా చాటింది. కాగా పాపన్నపేటలో బతుకు సాగక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తున్నారు. ఇటీవల పదో తరగతి పాస్ అయింది. కబడ్డీ తన శ్వాస అని, ఎస్సై కావాలన్నదే తన జీవిత ఆశయమని అశ్రుత తెలిపింది.
– అశ్రుత. పాపన్నపేట


