మెదక్‌జోన్: నాన్న చిన్నతనంలో నేర్పిన క్రమశిక్షణ నన్ను ఇంతటివాడిని చేసిందని మెదక్ అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్(ఐపీఎస్) అన్నారు. ఫాదర్స్‌డే సందర్భంగా ఆయనను శనివారం సాక్షి పలుకరించగా ఆయన మాటల్లోనే... మాది ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా. తండ్రి మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ జడ్జి, తల్లి మంజూ సింగ్ గృహిణి. నేను రెండో వాణ్ణి. మా అన్నయ్య ప్రశాంత్‌సింగ్ వివాహమైంది. అన్నా–వదినలిద్దరూ న్యాయయూర్తులుగా పనిచేస్తున్నారు. మా తండ్రి న్యాయమూర్తి కావటంతో చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణగా పెంచాడు. ఆయన సంతోషించినా, బాధపడినా లోలోపలే తప్పా, ఏనాడు బయటకు చెప్పేవారు కాదు. నా ప్రాథమిక విద్య నుంచి బీటెక్ వరకు యూపీలోని ముజఫర్‌నగర్, ఆగ్రా, కాన్పూర్, మీరట్‌లో కొనసాగింది. మా అన్నయ్యతో పాటు నాన్న కోరిక మేరకు 2021లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, 2022 బ్యాచ్‌లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను.


