రాయికోడ్(అందోల్): రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ జి.అంజయ్య, రాయికోడ్ ఏఎంసీ చైర్మెన్ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లాపూర్ శివారులో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సిద్దప్పపాటిల్, నాయకులు బస్వరాజ్ పాటిల్, నర్సింహులు తదితరులతో కలిసి సుమారు రూ.2.92 కోట్ల నిధులతో నిర్మించనున్న మార్కెట్ యార్డు గోదాం భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం ఉండేలా గోదాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రాయికోడ్, మునిపల్లి మండలాల రైతులకు గోదాం నిర్మాణంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్‌కుమార్, నాయకులు కేధారినాథ్ పాటిల్, సంగమేశ్వర్ పాటిల్, తుకారామ్, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
రాహుల్‌ను
ప్రధానిగా చూడాలి
జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి ఉజ్వల్‌రెడ్డి
జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే ఆకాంక్ష పార్టీ శ్రేణుల్లో ఉందని, ఇందుకోసం ప్రతీ కార్యకర్త పార్టీ కోసం అంకితభావంతో పని చేయాలని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి పిలుపు నిచ్చారు. జహీరాబాద్‌లో శుక్రవారం రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ ఐక్యత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం రాహూల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, మున్సిపల్ చైర్మన్ యూనూస్, కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, మంకాల్ సుభాష్, శ్రీకాంత్‌రెడ్డి, మోతిరాం, హర్షవర్ధన్‌రెడ్డి, జాఫర్, నాగిరెడ్డి, కౌన్సిలర్లు శ్రీధర్‌రెడ్డి, అరుణ్, జమీలుద్దీన్, జహంగీర్ నిజాం పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సాంకేతిక
నైపుణ్యాలు పెంపొందించాలి
ప్రభుత్వ పాలిటెక్నిక్
కళాశాల ప్రిన్సిపాల్ జానకిదేవి
సంగారెడ్డి టౌన్: విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకిదేవి పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏఐ డిజిటల్ లెర్నింగ్ అంశాలపై రెండు రోజుల శిక్షణ తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మారుతున్న విద్యా విధానాలకనుగుణంగా విద్యార్థులు ఏఐ డిజిటల్ సాంకేతికపై అవగాహన పెంపొందించుకుంటూ టెక్నాలజీలో ముందుండాలన్నారు. ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ సుగుణరావు, నోడల్ ఆఫీసర్ మంజుల, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో
విలీనం చేయాలి
జహీరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని కోరుతూ స్థానిక డిపో వద్ద శుక్రవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వం విలీనానికి సుముఖత వ్యక్తం చేసిందని కార్మిక నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్, శశికుమార్, మోయిన్, యువరాజ్, అహ్మద్, శ్రవణ్, ఎంఎస్.రెడ్డి, ఐఎస్.రెడ్డి, తిప్పన్న, సమి, రత్నం, జీవన్, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


