సంగారెడ్డి జోన్: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్‌కనుగుణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. సర్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. జిల్లా స్థాయిలో కూడా మరో రెండు రోజుల్లో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


