రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానిక డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ అన్నారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మయూరినగర్ కాలనీలో పటుచోట్ల డ్రైనేజీ రోడ్లపై పారుతుందని తెలిపారు. గత స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా కాలనీల్లో ఎక్కడ చూసిన సమస్యలు కనిపిస్తున్నాయని తెలిపారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


