రామచంద్రాపురం(పటాన్‌చెరు): భారతినగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని శుక్రవారం మాజీ కార్పొరేటర్ సింధు రెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్‌నగర్ కాలనీ గతంలో మున్సిపాలిటీ పరిధిలో ఉండగా.. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో విలీనమైందన్నారు. కావున తాగునీటి సరఫరా వ్యవస్థను జలమండలికి అమీన్‌పూర్ సర్కిల్‌కు అప్పగించాలని కోరినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని వివరించారు.
నీటి సంరక్షణపై అవగాహన
మునిపల్లి(అందోల్): నీటి సంరక్షణపై మిషన్ భగీరథ ఏఈ స్వాతి ప్రజలకు అవగాహన కల్పించారు. శుక్రవారం మండలంలోని మగ్దుంపల్లి సర్పంచ్ సరళ ఆధ్వర్యంలో నీటి సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహిచారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకూడదని, మట్టి కుండలను వాడాలన్నారు. అనంతరం రాజకీయ పార్టీలకతీతంగా నాయకులు పాల్గొని మట్టి కుండల్లో నీటిని వాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రసూల్ పటేల్, వీరేశం, వీరన్న, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరికలు
నారాయణఖేడ్: స్థానిక నియోజకవర్గంలోని బాణాపూర్, బోరంచ, బెల్లాపూర్, హంగిర్గా(కె), ఎనక్‌పల్లి, జగన్నాథ్‌పూర్, నాగాపూర్‌లకు చెందిన పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి టీఆర్‌ఎస్ పార్టీ ఖేడ్ ఇన్‌చార్జి బాపుమల్‌శెట్టి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు పార్టీలో చేరిన శరణప్ప, నాగిరెడ్డి, కిషన్‌నాయక్, సంగమేష్, మోహన్, సురేష్ పాటిల్, రేఖానాయక్, బుల్లిబాయి, బాబునాయక్‌లకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలోనాయకులు బీమయ్య, మాణిక్యం, ప్రశాంత్, పండరి పాల్గొన్నారు.
ఎస్‌ఐకు సన్మానం
మునిపల్లి(అందోల్): బుదేరా ఎస్‌ఐ అరవింద్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని చిన్నచల్మెడకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రుద్ర కృష్ణ ఆయనను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మల్లికార్జున స్వామి దేవస్థానం
ఈఓగా దేవనాఽథం
పటాన్‌చెరు టౌన్: అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నెలకొన్న భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈఓగా పనిచేసిన శశిధర్ గుప్తా బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో జిన్నారం పరిధిలోని పలుగుపోచమ్మ దేవస్థానం ఈఓగా విధులు నిర్వహిస్తున్న దేవనాథం శుక్రవారం నూతన ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.


