పటాన్‌చెరు టౌన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పటాన్‌చెరు మండల పరిధిలోని నందిగామ గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా వినాయక బివరేజ్ కంపెనీని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన నీటి వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ పనితీరును పరిశీలించి, వ్యర్థాల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ అనిత, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, నందిగామ సర్పంచ్ విక్రమ్‌గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి రాజేందర్, ప్రజలు, పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ
అధికారి మల్లారెడ్డి


