‘కంది’లో సస్యరక్షణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

‘కంది’లో సస్యరక్షణ చర్యలు

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

జహీరాబాద్‌ టౌన్‌: కంది పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. శుక్రవారం మొగుడంపల్లి మండలంలోని గుడ్‌పల్లి, ఇప్పెపల్లి గ్రామాల్లోని కంది పండిస్తున్న రైతులకు ఇక్రిశాట్‌ ప్రతినిధులు జీవ నియంత్రణ కారకాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్‌ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్‌ ప్రతినిధులు రాజు, రాజేంద్రప్రసాద్‌, అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విత్తన శుద్ధి గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుదర్శన్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ అబ్దుల్‌ మన్నన్‌, ఏఈఓ ప్రదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement