పుల్‌కల్(అందోల్): పుల్‌కల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నూతన భవనాన్ని జిల్లా వైద్యాధికారి లలితాదేవి బుధవారం సందర్శించారు. నూతన భవనంలో మౌలిక సౌకర్యాలను, పీహెచ్‌సీలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం గొంగ్లూర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించారు.
22 నుంచి రాష్ట్రస్థాయి
శిక్షణ తరగతులు
సంగారెడ్డి టౌన్: కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను ఈ నెల 22 నుంచి రెండు రోజులపాటు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూల నుంచి కల్లు గీత కార్మిక సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు రామాగౌడ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యాదగౌడ్, సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా నాయకులు ప్రవీణ్‌గౌడ్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సు సీజ్ చేస్తాం
ఎంవీఐలు చంద్రశేఖర్, జయప్రకాశ్‌రెడ్డి
పటాన్‌చెరు టౌన్: విద్యాసంస్థల బస్సులను నిబంధనలను విరుద్ధంగా నడిపితే సీజ్ చేస్తామని పటాన్‌చెరు ఎంవీఐ చంద్రశేఖర్, జయప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. పటాన్‌చెరు, బీరంగూడ, అమీనన్‌పూర్ జాతీయ రహదారిపై బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఏడు బస్సులను సీజ్ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా వారం రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు కొనసాగనున్నట్లు వెల్లడించారు.
బాగారెడ్డికి ఘనంగా
నివాళులు
జహీరాబాద్: మాజీ ఎంపీ ఎం.బాగారెడ్డికి ఆయా పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం 96వ జయంతిని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి విగ్రహానికి ఆయా పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు సదుద్దీన్‌గౌరి, శివాజీపాటిల్, సతీశ్‌రెడ్డి, భాస్కర్, ఎం.పాండురంగారెడ్డి, జగన్నాథ్, బుచ్చిరెడ్డి, విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రెండో రోజు ‘టెట్’ ప్రశాంతం
సిద్దిపేటఅర్బన్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) పరీక్ష రెండో రోజు బుధవారం ప్రశాంతంగా కొనసాగింది. పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహించారు. ఉదయం సెషన్‌కు 50 మందిని కేటా యించగా 36 మంది హాజరయ్యారు. మధ్యా హ్నం సెషన్‌కు 50 మందికి గాను 46 మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు.


