రూ.
జిల్లాలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాల్లో కొన్ని అక్రమాలకు అడ్డాలుగా మారాయి. తరుగు తీయకూడని జొన్నల్లో కూడా బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీస్తూ ఆయా కేంద్రాల నిర్వాహకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారు పర్యవేక్షణ లేకపోవడంతో నిజాంపేట్ మండలంలోని బాచేపల్లి పీఏసీఎస్ పరిధిలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రంలో తరుగు దోపిడీని యథేచ్ఛగా సాగిస్తున్నారు. నారాయణఖేడ్:
బాచేపల్లి సొసైటీ పరిధిలో బాచేపల్లి, మాసాన్‌పల్లి, దేవునిపల్లి, ఖానాపూర్ (బి), రాంరెడ్డిపేట్, దామర్‌చెరువు, మీర్ఖాన్‌పేట్, రాపర్తి, అలికాన్‌పల్లి, మునిగేపల్లి, నాగ్‌ధర్ గ్రామాలు వాటి పరిధిలోని తండాలున్నాయి. ఈ చిన్న సొసైటీలో సుమారు 45 వేల బస్తాలు..22,400 వేల పైచిలుకు క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశారు. కల్హేర్ మండలంలో కల్హేర్‌తోపాటు బీబీపేట, నిజాంపేట్ మండల కేంద్రంలో కూడా జొన్నల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. పై కేంద్రాలన్నింటికంటే ఈ ఒక్క కేంద్రంలోనే భారీగా కొనుగోళ్లు చేపట్టడం విస్మయానికి గురిచేస్తోంది. సొసైటీ పరిధిలోని నిజాంపేట్ మండలంలో 3,114 ఎకరాలు, ప్రక్కనే ఉన్న కల్హేర్ మండలంలో 7,721 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. వాస్తవానికి ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలి.
రూ.33.14లక్షల తరుగు దోపిడీ
బాచేపల్లి సెంటర్‌తోపాటు నాగ్‌ధర్, రాపర్తి, దేవునిపల్లి, బల్కంచెల్క తండాల్లో ఉపకేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రాల్లో ఒక్కో బస్తా వద్ద 2 కిలోల తరగు పేర క్వింటాల్‌కు 4కిలోలు తరగు పేరిట దోపిడీ చేసేశారు. క్వింటాల్‌కు 4కిలోల తరుగు తీస్తే సొసైటీలో కొన్న 22,400 క్వింటాళ్లకు 896 క్వింటాళ్ల వరకు తరుగు తీశారు. ఈ లెక్కన క్వింటాల్‌కు ప్రభుత్వ ధర రూ.3,699 చొప్పున మొత్తం రూ. 33,14,304లు రైతుల వద్ద నొక్కేశారు. కాగా, కేంద్రానికి కర్ణాటక ప్రాంతం నుంచి సైతం జొన్నలు తెచ్చి దళారులు రైతుల పేర విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయి. జొన్నలకు తరుగు తీయకూడదు కదా అని ప్రశ్నిస్తే కొంత ఎక్కువ తక్కువగా తీశామని, బస్తాలు చిరిగి ఉండటంతో బస్తాకు 2కిలోల చొప్పున తరుగు తీశామని కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు విఠల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. దళారులు, వ్యాపారుల సరుకు కొనుగోలు చేశారనే ఆరోపణలపై బాచేపల్లి సెంటర్ ఇన్‌చార్జి నరేందర్‌ను ప్రశ్నించగా కొందరు తెలిసిన వారు, బంధువుల పేర్లపై తూకం వేయించారని సమాధానమిచ్చారు.
తరుగుపేరిట జొన్న రైతులను నిలువు దోపిడీ
బాచేపల్లి సొసైటీలో జొన్నలకొనుగోళ్ల తీరు
క్వింటాలుకు 4కిలోల తరుగు
కొనుగోలు కేంద్రంపై కొరవడిన నిఘా


