పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

జహీరాబాద్‌: జహీరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని ఆయా మండలాలకు, పట్టణాలకు ఇటీవల నియమితులైన అధ్యక్షులు, వారి అనుయాయులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీ భవన్‌కు వెళ్లి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎంపీ షెట్కార్‌, జహీరాబాద్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి ఎ.చంద్రశేఖర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

నిన్న అసమ్మతి వాదులు,

నేడు మద్దతు దారులు

హీరాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీలో నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలిపోయింది. పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయం తమకు తెలియకుండా అధిష్టానవర్గం చేత చంద్రశేఖర్‌ మమ అనిపించి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఈనెల 15న అసమ్మతివాదులు గాంధీ భవన్‌కు వెళ్లి నిరసన తెలిపిన విషయం విదితమే. దీంతో ఆందోళనకారులను అధిష్టానవర్గం శాంతింపజేసింది. తిరిగి ఎన్నికలు నిర్వహించేలా చూస్తామని బుజ్జగించడంతో అసమ్మతివాదులు చల్లబడిన సంగతి తెలిసిందే.

ఎన్నికై న కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు

అధిష్టానానికి కృతజ్ఞతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement