సాగులో సేంద్రియ పద్ధతులు | - | Sakshi
Sakshi News home page

సాగులో సేంద్రియ పద్ధతులు

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

పల్లె జీవనోపాధి కేంద్రంలో అద్దెకు యంత్రాలు

హుస్నాబాద్‌రూరల్‌: వ్యవసాయ సాగులో సేంద్రియ పద్ధతులను పాటిస్తే పెట్టుబడుల భారం తగ్గి దిగుబడులు పెరుగుతాయని అదనపు డీఆర్‌డీఓ రొనాల్డ్‌ సుధీర్‌కుమార్‌ అన్నారు. బుధవారం మీర్జాపూర్‌ క్లస్టర్‌లో పల్లె మహిళా జీవనోపాధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె మహిళా జీవనోపాధి కేంద్రాలను తీసుకొచ్చిందన్నారు. సాగుపై ఆసక్తి కలిగిన మహిళలను ప్రోత్సహిస్తే బంగారు పంటలు పండిస్తారనే నమ్మకంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. పంటల సాగులో రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడితే ఆరోగ్యంతో జీవిస్తామని తెలిపారు. మహిళ జీవనోపాధి కేంద్రంలో అద్దెకు వ్యవసాయ యంత్రాలు దొరుకుతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఆమోదం ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలని ఆత్మకమిటీ చైర్మన్‌ అయిలయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్‌ నవీన్‌కుమార్‌, ఎంపీడీఓ సతీశ్‌, ఏపీఎం తిరుపతి, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ చందు, సర్పంచ్‌లు సంపత్‌, జవహర్‌, రాజేశ్వరి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement