గజ్వేల్‌రూరల్: ఆత్మహత్యకు యత్నించిన మహిళను ఓ వ్యక్తి కాపాడాడు. ఈ సంఘటన బుధవారం గజ్వేల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని కోటమైసమ్మ ప్రాంతంలో నివాసముండే డప్పు మైసమ్మ(65)కు భర్త, పిల్లలు లేరు. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెంది గజ్వేల్‌లోని బరి చెరువులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సమయంలో చేపలు పట్టేందుకు వచ్చిన మర్కూక్ మండలం పాతూరులోని డబుల్ బెడ్రూమ్‌కు చెందిన మహ్మద్ తకియొద్దీన్ గమనించి ఆమెను కాపాడాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో తకియొద్దీన్‌ను సన్మానించారు.
కాపాడిన వ్యక్తిని
సన్మానించిన
పోలీసులు


