చిన్నశంకరంపేట(మెదక్): రహదారులపై ధాన్యం ఆరమెట్టిన రైతులకు పోలీసులు నోటీసులు జారి చేశారు. ఈ సంఘటన చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లిలో చోటుచేసుకుంది. రోడ్లపై ధాన్యం ఆరబెడితే క్రిమినల్ చర్యలు చేపట్టడంతో పాటు ధాన్యం సీజ్ చేయనున్నట్లు ఎస్‌ఐ నారాయణగౌడ్ పేర్కోన్నారు. రహదారులపై ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, కొందరు తీవ్ర గాయాలతో బయటపడుతుండగా, మరి కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ధాన్యం కల్లాల వద్దనే ఆరబెట్టుకోవాలని సూచించారు. రహదారులపై ఆరబెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


