స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

పటాన్‌చెరు టౌన్‌: స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఓ మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అభిమాన్‌ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఇస్నాపూర్‌కు చెందిన సత్యనారాయణ (54) బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం తన స్కూటీపై ఇస్నాపూర్‌ నుంచి పోచారం వైపు వెళుతుండగా.. ముత్తంగి సమీపంలోకి రాగానే సంగారెడ్డి వైపు నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణ కింద పడిపోవడంతో అతనిపై నుంచి లారీ వెళ్లింది. తీవ్ర గాయాలపాలై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రాకేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement