నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ విక్రయం | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ విక్రయం

Oct 9 2025 8:05 AM | Updated on Oct 9 2025 8:05 AM

నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ విక్రయం

నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్‌ విక్రయం

నలుగురు నిందితుల అరెస్టు

సిద్దిపేటకమాన్‌: నకిలీ పత్రాలు సృష్టించి లేని భూమిని ఉన్నట్లు చూపించి ప్లాట్‌ను విక్రయించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. టూటౌన్‌ సీఐ ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కుషాల్‌నగర్‌ సర్వే నంబర్‌ 1299లో భూమి లేకున్నా 90 చదరపు గజాల ప్లాట్‌ ఉన్నట్లు పట్టణానికి చెందిన రమణగౌడ్‌, నరేందర్‌, రమేష్‌, చంద్రశేఖర్‌లు నకిలీ పత్రాలు సృష్టించి రామరాజు వెంకటేష్‌కు రూ.12లక్షలకు గతంలో విక్రయించారు. అనంతరం వెంకటే్‌శ అట్టి ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి ప్రయత్నించగా ప్లాట్‌ అసలు యజమాని వచ్చి అడ్డుకున్నాడు. దీంతో వెంకటేష్‌ మోసపోయినట్లు గ్రహించి విక్రయించిన వారిని డబ్బులు అడగగా.. ఇవ్వకపోవడంతో పై నలుగురిపై బాధితుడు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ ఆసిఫ్‌ దర్యాప్తులో ప్లాట్‌ పత్రాలు సేకరించి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించినట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement