
నిత్యం నరకమే
రామచంద్రాపురం, ఎంఐజీ, ఎల్‌ఐజీ, విద్యుత్‌నగర్, బెల్ కాలనీలకు చెందిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు నిత్యం రాకపోకలు సాగించే తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీ నుంచి తెల్లాపూర్ మార్గంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ కొద్ది రోజుల పనిచేసి తర్వాత మొరాయించడంతో కొంతమంది వాహనదారులు ఇష్టానుసారంగా వస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. –రామచంద్రాపురం(పటాన్‌చెరు)