రంగనాయకా.. రక్షణ ఏదీ? | - | Sakshi
Sakshi News home page

రంగనాయకా.. రక్షణ ఏదీ?

Aug 2 2025 7:20 AM | Updated on Aug 2 2025 7:20 AM

రంగనా

రంగనాయకా.. రక్షణ ఏదీ?

గొర్రెలకు వ్యాధి నివారణ టీకాలు
కలెక్టర్‌ ప్రావీణ్య
ముస్కాన్‌11తో బాలకార్మికుల సంరక్షణ
జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

సంగారెడ్డి టౌన్‌: గొర్రెలలో వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని కలెక్టర్‌ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో శుక్రవారం ఏర్పాటుచేసిన గొర్రెలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి వల్ల గొర్రెలకాపరులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం ప్రభుత్వం గొర్రెలకు ఉచితంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నదని పెంపకం దారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు, వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

స్థల సేకరణ పనులు వేగవంతం చేయాలి

సంగారెడ్డి జోన్‌: జిల్లాలో జీ ప్లస్‌ త్రీ మోడల్‌ ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..మోడల్‌ గృహనిర్మాణాల కోసం భూధాన్‌ భూములను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 5,956 గృహాలు మంజూరైనట్లు తెలిపారు. నిమ్జ్‌ కోసం చేపట్టిన భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, హౌసింగ్‌ పీడీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జోన్‌: ఆపరేషన్‌ ముస్కాన్‌తో బాలకార్మికులకు సంరక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ పేర్కొనారు. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్‌ ముస్కాన్‌ 11 వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ చేపట్టిందని, ప్రతీ ఏటా జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ పేర్లతో రెండు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 126 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. వీరిలో 119–మంది బాలురు, 07–మంది బాలికలు ఉన్నారు. బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకున్న యజమానులపై 81 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులకు రక్షణ కరువైంది. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రిజర్వాయర్‌ వద్ద ప్రకృతిని ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొందరు రిజర్వాయర్‌లోకి దిగుతుండటంతో నీటి గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు.

రక్షణ చర్యలు లేక..

ఇటీవల వర్షాలు కురువడంతో రిజర్వాయర్‌లోకి భారీగా వరద చేరింది. రిజర్వాయర్‌ అందాలను వీక్షించేందుకు సిద్దిపేట, సమీప ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. సెల్ఫీలు, ఫొటోలు దిగే క్రమంలో నీటి అంచుల వరకు చేరుకుంటున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇటీవల వరంగల్‌ జిల్లా విద్యార్థులు ఇద్దరు నీటిలో దిగి మృత్యువాత పడ్డారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

రంగనాయకా.. రక్షణ ఏదీ?1
1/2

రంగనాయకా.. రక్షణ ఏదీ?

రంగనాయకా.. రక్షణ ఏదీ?2
2/2

రంగనాయకా.. రక్షణ ఏదీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement