
నల్లవాగు కాల్వలో పూడికతీత
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు కాల్వల్లో శుక్రవారం పూడికతీత పనులు చేపట్టారు. కాల్వల్లో ఉన్న మొక్కలను, మట్టిని తొలగించారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద దాదాపు 6 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల్లో పూడిక మట్టి, చెత్త, మొక్కలు నిండిపోయాయి. నీటి సరఫరా కోసం ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆయకట్టు కింద సాగు నీటి సరఫరాకు ఆటంకం ఉండకుండా ముందస్తుగా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించడంతో కల్హేర్ మండలం బీబీపేట, ఖానాపూర్(కె), కృష్ణాపూర్, తదితర చోట్ల జేసీబీలతో ప్రాజెక్టు కాల్వల్లో పూడిక తీసి శుభ్రం చేసే పనులకు శ్రీకారం చుట్టారు. ఇరిగేషన్ డీఈఈ పవన్‌కుమార్ పనులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏఈలు శివధర్‌రెడ్డి, మల్లేశం, కాంగ్రెస్ నాయకులు తుకారాం పాల్గొన్నారు.