
కనీస వేతనాలు అమలు చేయాలి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ బేసిస్‌లో పని చేస్తున్న ఉద్యోగులు, పూజారులకు కనీస వేతనం అమలు చేయాలని ఎమ్మెల్సీసీ.అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ..దేవాదాయ శాఖ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగులు సరైన వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలని కోరారు.
‘సిగాచి’ నష్టపరిహారం
చెల్లింపులో జాప్యం
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు
జహీరాబాద్ టౌన్: సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. దిగ్వాల్ పిరామిల్ పరిశ్రమలో శుక్రవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు పరిహారం ప్యాకేజీ బాధిత కుటుంబాలకు అందలేదని మండిపడ్డారు. దశల వారీగా కాకుండా ఒకే విడతలో పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం,క్లస్టర్ కన్వీనర్ మహిపాల్, నాయకులు నర్సయ్య, మాణిక్‌రెడ్డి, ప్రభు, నర్సింలు పాల్గొన్నారు.
హామీలను విస్మరించిన
కాంగ్రెస్ ప్రభుత్వం
సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్
జహీరాబాద్ టౌన్: అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్ ఆరోపించారు. జహీరాబాద్ డివిజన్ సీపీఐ మహాసభలు శుక్రవారం ప్రారంభమైన సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ...స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐకి బలం ఉన్న చోట పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతా రని హెచ్చరించారు. సమావేశంలో డివిజన్ కా ర్యదర్శి కె.నర్సింలు, నాయకులు ఆశ్వాక్, అఫ్జ ల్, శంకర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
‘కృష్ణమూర్తి పోరాటం
స్ఫూర్తిదాయకం’
జహీరాబాద్ టౌన్: కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి పోరాటం స్ఫూర్తిదాయకమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ పేర్కొన్నారు. కాచం కృష్ణమూర్తి వర్థంతిని పురస్కరించుకుని మండలంలోని బూచినెల్లి గ్రామంలో శుక్రవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. పేదలకు భూములు పంచాలని, కూలీ పెంచాలని, వెట్టి చాకిరి రద్దు చేయాలని ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు.

కనీస వేతనాలు అమలు చేయాలి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కనీస వేతనాలు అమలు చేయాలి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కనీస వేతనాలు అమలు చేయాలి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి