
ప్రతి పౌరుడు చట్టాన్ని గౌరవించాలి
మాజీ జడ్జి డాక్టర్ హేమంత కుమార్
పటాన్‌చెరు: ప్రతీ పౌరుడు దేశ చట్టాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని లేదంటే కోర్టులో తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ జిల్లా సెషన్స్ జడ్జ్జి, తెలంగాణ ఎన్నికల సంఘం న్యాయ సలహాదారు డాక్టర్ హేమంత కుమార్ స్పష్టం చేశారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ‘చట్టపరమైన హక్కులు, బాధ్యతలు’పై గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పోక్సో, మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్ నిరోధక చట్టాలు, రాజ్యాంగ నిబంధనలు, ప్రాథమిక హక్కులు, బాధ్యతలతో సహా పలు కీలక చట్టాల గురించి విద్యార్థులకు తెలిపారు. న్యాయ సలహా కోరుకునే వారెవరైనా జిల్లా న్యాయ సేవా సంఘం చైర్మన్ లేదా కార్యదర్శికి లేఖ రాసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని వెల్లడించారు.