అణగారిన వర్గాల ఆత్మబంధువు బాబూ జగ్జీవన్ రామ్
● టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్
మెదక్‌జోన్ : అణగారిన వర్గాల ఆత్మబంధువు బాబూ జగ్జీవన్ రామ్ అని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ ఉద్ఘాటించారు. శనివారం స్థానిక టీఎన్‌జీవో భవన్‌లో నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ, రక్షణ శాఖ, భారత ఉప ప్రధానిగా పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించి దేశ అభ్యున్నతికి నూతన సంస్కరణలు చేపట్టి ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక దృక్పథంతో కుల వివక్షకు వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపరిచే అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ పాషా, కోశాధికారి ఎం.చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి శివాజీ, సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.
మహిళపై అత్యాచారం,హత్యాయత్నం కేసులో..
● నిందితుడి అరెస్ట్
జోగిపేట(అందోల్): మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏర్పుల అనిత అనే మహిళ కొద్ది రోజులుగా భర్తతో గొడవపడి అమ్మవారి ఇంట్లోనే తన పిల్లలతో గోంగులూరు తండాలోనే ఉంటూ సంగారెడ్డిలో కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తుంది. మిన్పూర్‌కు చెందిన ఆంజనేయులుతో కూలీ పని వద్ద పరిచయం ఏర్పడింది. 2న ఆంజనేయులు కూలీ పని ఉందని అనితకి ఫోన్ చేయడంతో ఆమె చౌటుకూరు బస్టాప్ వద్దకు వచ్చింది. బైక్‌పై ఎక్కించుకొని పోసానిపల్లి– బొమ్మరెడ్డిగూడెం మధ్యలోని అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోతుండగా ప్రతిఘటించింది. పెనుగులాటలో నిందితుడు ఆమైపె కత్తితో దాడి చేయడంతో మెడపై గాయమైంది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోసానిపల్లి రోడ్డు పైకి వచ్చి పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి కాపాడారు. ఆంజనేయులు ఆమె ఫోన్‌ను తీసుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు,
ఏజెన్సీపై కేసు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున ఆలయంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు సంబంధించి రూ.28 లక్షల మేర జీఎస్టీ, పీఎఫ్, ఈఎస్‌ఐ డబ్బులు చెల్లించకుండా స్వాహా చేసిన హిమాన్ష్ సీఆర్‌ఎం సర్వీసెస్ ఏజెన్సీపై గతంలో ఆలయ ఈవో రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. శనివారం ఆలయ అధికారులతో విచారణ చేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు చేర్యాల సీఐ శ్రీను తెలిపారు.
ఆరేళ్ల కిందట అదృశ్యం..
నేడు పోలీసులకు ఫిర్యాదు
● ఏడేళ్ల వరకు ఆచూకీ దొరక్కపోతే
డెత్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం!
కల్హేర్(నారాయణఖేడ్): వృద్ధురాలు అదృశ్యం కావడంతో కేసు నమోదు చేసినట్లు సిర్గాపూర్ ఎస్‌ఐ డీ.వెంకట్‌రెడ్డి శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. సిర్గాపూర్ మండలం పోట్‌పల్లికు చెందిన శరద సాయవ్వ ఆరేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన సమయం నుంచి ఏడేళ్ల వరకు ఆచూకీ లభించకపోవడంతో ఎఫ్‌ఐఆర్ సమర్పించి డెత్ సర్టిఫికెట్ పోందే అవకాశం ఉంటుంది. సాయవ్వ పేరు మీద వ్యవసాయ భూమి ఉంది. దీంతో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అణగారిన వర్గాల ఆత్మబంధువు బాబూ జగ్జీవన్ రామ్
అణగారిన వర్గాల ఆత్మబంధువు బాబూ జగ్జీవన్ రామ్


