వర్షానికి గోడ కూలి వ్యక్తి మృతి
గజ్వేల్‌రూరల్: వర్షానికి ప్రహరీ గోడ కూలి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జాలిగామ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. గజ్వేల్ పట్టణానికి చెందిన హిమ్మత్‌ఖాన్ 45)కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఎలక్ట్రిషియన్‌గా పని చేసే హిమ్మత్‌ఖాన్ జాలిగామ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ గోదాంలో గురువారం పనికి వెళ్లాడు. వర్షం రావడంతో ప్రహరీ గోడ కూలగా శిథిలాల్లో ఇరుక్కొని హిమ్మత్‌ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తు కిందపడి మేసీ్త్ర
చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన చిట్టోజిపల్లిలోని పరిశ్రమలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమ జిల్లాకు చెందిన బూంది బగేల్(40) చిట్టోజిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న జిటెక్ పరిశ్రమలో మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. పైన పనులు చేస్తున్న క్రమంలో కాలుజారి కిందపడ్డాడు. తీవ్రగాయాలైన అతడిని నార్సింగి ప్రైవేటు ఆస్పత్రికి తర లించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలి పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నీటి గుంటలో పడి గుర్తు తెలియని వ్యక్తి..
జిన్నారం (పటాన్‌చెరు): గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం మేరకు.. బొల్లారంలోని జ్యోతి థియేటర్ సమీపంలో 45 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి వర్షం కురుస్తుండగా మూర్చ వ్యాధితో కిందపడ్డాడు. స్థానికులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మల్లన్న బస్తీ సమీపంలో ప్రమాదవశాత్తు చిన్న నీటి గుంటలో పడి మృతి చెందాడు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వర్షానికి గోడ కూలి వ్యక్తి మృతి


