ఆన్‌లైన్ మోసాలపై అవగాహన
సంగారెడ్డి జోన్: ఆన్‌లైన్ బెట్టింగ్స్, యాప్స్, మోసాలు, డ్రగ్ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిచాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా ఉండాలని సూచించారు. అత్యాచార, పొక్సో కేసులలో దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీ పరితోష్ పంకజ్


