
అక్రమ తవ్వకాలు జరిపిన ప్రభుత్వ భూమి ఇదే
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పల్పనూరు గ్రామస్తుల డిమాండ్
హత్నూర(సంగారెడ్డి): అర్ధరాత్రి సమయంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పల్పనూరు గ్రామస్తులు కోరారు. మంగళవారం హత్నూర తహసీల్దార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారు 291 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిలో కొన్ని రోజులుగా కొందరు అక్రమార్కులు అర్ధరాత్రిళ్లు ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. మట్టి తవ్వుతున్న స్థలం వద్దకు చేరుకొని జేసీబీలను అడ్డుకున్నామని చెప్పారు. అప్పటికే లోడ్ చేసుకున్న టిప్పర్‌లను పంపించి వేశారన్నారు. జేసీబీలను పట్టుకుంటే బెదిరించి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.