ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 11:30 AM | Updated on Feb 26 2023 6:45 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌. చిత్రంలో డీఎంహెచ్‌ఓ గాయత్రీదేవి - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌. చిత్రంలో డీఎంహెచ్‌ఓ గాయత్రీదేవి

సంగారెడ్డి టౌన్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో 95 శాతం ప్రసవాలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శుక్రవారం జిల్లావైద్య,ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి గర్భిణీని ఏఎన్‌ఎం తప్పనిసరిగా 12 వారాల లోపు నమోదు చేయించి, క్రమం తప్పకుండా నిర్ణీత వ్యవధిలో పరీక్షలు చేయించాలన్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవాలు జరిగేటట్టు ప్రోత్సహించాలన్నారు. పుట్టిన ప్రతి శిశువుకు వారి వయసు ఆధారంగా సకాలంలో టీకాలు వేయించాలని ఆదేశాలు జారీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి టీం రోజు 250 మందిని పరీక్షించాలన్నారు. దగ్గరచూపు.. దూరపుచూపు వారికి అద్దాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గాయత్రీదేవి, ప్రోగ్రాంఆఫీసర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

95శాతం చేరేలా ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement