● మరో ముగ్గురికి గాయాలు
● పామెన బస్టాప్ వద్ద ప్రమాదం
చేవెళ్ల: అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పామెన బస్ స్టేజీ సమీపంలో శనివారం రాత్రి ఈప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్(25) తన ఇన్నోవా కారులో స్నేహితులైన మురళీగౌడ్, ఒగ్గు వెంకటయ్య, కార్ల శివకుమార్‌తో కలిసి చేవెళ్ల వైపు వెళ్తున్నారు. వేగంగా ఉన్న కారు పామెన స్జేజీ వద్ద అదుపుతప్పి, డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డువైపు వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నడుతుపున్న రాజ్‌కుమార్‌తో పాటు ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని అంబులెన్స్‌లో మొయినాబాద్‌లోని భాస్కర ఆస్పత్రికి తరలించగా రాజ్‌కుమార్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన మురళి, వెంకటయ్యను మెరుగైన చికిత్స కోసం నగరంలోని ప్రైవేటుకు తరలించగా, శివకుమార్‌కు చికిత్స చేసి పంపించారు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


