ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌లో ప్రజాపాలన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌లో ప్రజాపాలన వేడుకలు

Sep 18 2026 8:18 AM | Updated on Sep 18 2026 8:18 AM

ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌లో ప్రజాపాలన వేడుకలు 20న అథ్లెటిక్స్‌ సెలక్షన్స్‌

ఇబ్రహీంపట్నం: ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో తెలంగాణ ప్రజా పాలన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కమిషనర్‌ తరుణ్‌జోషి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ చందనా దీప్తి, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

తాండూరు టౌన్‌: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మధు, కార్యదర్శులు రాము, రాములు గురువారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌లోని బ్లాక్‌ గ్రౌండ్‌లో ఈ పోటీలు ఉంటాయన్నారు. అండర్‌ –14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు రన్నింగ్‌, జంపింగ్‌, షాట్‌పుట్‌ ఈవెంట్లలో ఎంపిక ప్రకియ ఉంటుందన్నారు. క్రీడాకారులు ఒరిజినల్‌ జనన ఽధ్రువీకరణ పత్రం లేదా ఎస్సెస్సీ మెమోతో రావాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈనెల 26, 27వ తేదీల్లో హన్మకొండలోనిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఇతర వివరాలకు సెల్‌ నంబర్‌ 9951343432, 6300075229లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement