నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు

Sep 18 2026 8:18 AM | Updated on Sep 18 2026 8:18 AM

ఇబ్రహీంపట్నం: నైపుణ్యాన్ని పెంపొందించుకుంటేనే ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని రాష్ట్ర విద్యా కమిషన్‌ మెంబర్‌ చారకొండ వెంకటేశ్‌ అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. రాధిక అధ్యక్షతన గురువారం శ్రీడా. బీఆర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ల అలోచనా విధానం–సామాజిక మార్పుశ్రీ అంశంపై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ కన్వీనర్‌ ప్రొ. డైసీ, నల్సార్‌ యూనివర్సిటీ ప్రొ.కరుణం మురళి మాట్లాడుతూ.. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకొని, వాటిలో నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నతస్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఓయూ ఆర్ట్స్‌ విభాగపు డీన్‌ ప్రొ.లింగప్ప, బీసీ సెల్‌ డైరెక్టర్‌ ప్రొ. మాధవి, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేష్‌,ఽ అధ్యాపకులు రమేష్‌, రవికుమార్‌, డీఎస్‌ఎస్‌ఆర్‌ కృష్ణ, శ్రీకృష్ణ, రచన, హృదయరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement