షాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయన చేసిన సేవలు మరువలేనివని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, మంత్రి అట్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన చెన్నయ్య వారి చేతుల మీదుగా అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్రీయ అధ్యక్షుడు గౌతమ్ మల్లేశ్, డాక్టర్ రాజు, మణీ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
899 మంది‘నిషా’చరులకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్‌లో ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తున్నారు. గత వారాంతమైన శుక్ర, శనివారాల్లో హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగాలు తనిఖీలు చేపట్టగా... 899 మంది డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో చేపట్టారు. వీరిలో హైదరాబాద్ పరిధిలో చిక్కిన వాళ్లు 572 మంది కాగా... సైబరాబాద్ పరిధిలో పట్టుబడిన వాళ్లు 327 మంది ఉన్నారు. ఈ ‘నిషా’చరుల్లో 730 మంది ద్విచక్ర, 56 మంది త్రిచక్ర, 109 మంది తేలికపాటి, మిగిలిన వాళ్లు ఇతర వాహనాల చోదకులు ఉన్నారు.
హైదరాబాద్ కమిషనరేట్‌లో చిక్కింది 572 మంది
సైబరాబాద్ పరిధిలో పట్టుబడిన వాళ్లు 327 మంది


