‘సర్‌’ను వేగవంతంగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ను వేగవంతంగా పూర్తిచేయాలి

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

‘సర్‌’ను వేగవంతంగా పూర్తిచేయాలి

చేవెళ్ల: సర్‌లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, చేవెళ్ల పార్లమెంట్‌ సర్‌ ఇన్‌చార్జి జగదీశ్‌ అన్నారు. పట్టణంలోని అట్లాస్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నియోజకవర్గ స్థాయిలోని పార్టీ బీఎల్‌ఏ(బూత్‌ స్థాయి ఏజెంట్ల) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగదీశ్‌తో పాటు నియోజకవర్గ సర్‌ ఇన్‌చార్జి ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జ్ఞానేశ్వర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్‌లో పార్టీ తరఫున బీఎల్‌ఏల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సర్‌ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీఎల్‌ఏల పనితీరు శూన్యంగా ఉందని, ఈ కారణంగా నియోజకవర్గం సీ–కేటగిరిలో ఉందన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. ఇప్పటికై నా బూత్‌స్థాయిలో ఉన్న ఓటర్లును కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. వెంటనే బీఎల్‌ఏలతో మండలాల వారీగా సమావేశం నిర్వహించి, ప్రతి బీఎల్‌ఏ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమతారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ పెంటయ్యగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్‌, ఐదు మండలాల అధ్యక్షులు, మూడు మున్సిపాలిటీల అధ్యక్షులు, గిరిధర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పెంటారెడ్డి, వెంకట్‌రెడ్డి, చంద్రమౌళి, వెంకట్‌రెడ్డి, నాయకులు జన్ధార్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, ఆగిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభాకర్‌, గోపాల్‌రెడ్డి, వీరేందర్‌రెడ్డి, ఐదు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

పీసీసీ ఉపాధ్యక్షుడు, సర్‌ చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి జగదీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement