పదేళ్లలో తట్టెడు మట్టి ఎత్తలేదు | - | Sakshi
Sakshi News home page

పదేళ్లలో తట్టెడు మట్టి ఎత్తలేదు

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

మార్కెటింగ్‌ మెలకువలు.. మహిళా రైతులు ఉత్పత్తులు చేయడంతో పాటు మార్కెటింగ్‌ మెలకువలు నేర్చుకోవాలని అడిషనల్‌ డీఆర్‌డీఓ అన్నారు. 8లోu

మార్కెటింగ్‌ మెలకువలు.. మహిళా రైతులు ఉత్పత్తులు చేయడంతో పాటు మార్కెటింగ్‌ మెలకువలు నేర్చుకోవాలని అడిషనల్‌ డీఆర్‌డీఓ అన్నారు.

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేస్తాం

షాద్‌నగర్‌, పరిగి ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్‌, రామ్మోహన్‌రెడ్డి

కొందుర్గు: అధికారంలోకి వస్తే కుర్చీ వేసుకుని కుర్చుని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాస్తానని నమ్మించి ఓట్లేయించుకున్న కేసీఆర్‌ తట్టెడు మట్టి ఎత్తలేదని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం వారు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల అదనపు కలెక్టర్లు, ఇరిగేషన్‌, ల్యాంక్‌ అక్విజేషన్‌, సర్వే అధికారులతో కలిసి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. దక్షిణ తెలంగాణ నిధులు ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని.. అది నాణ్యత లోపించి కూళేశ్వరం ప్రాజెక్ట్‌గా మారిందని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ గోదావరి జలాలతో ప్రాణహిత–చేవెళ్ల నుంచి పరిగి వరకు సాగునీరు అందిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. జూరాల నుంచి నీటిని తరలించి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మించేందుకు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి జీఓ విడుదల చేస్తే, అది రద్దుచేసి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మించేందుకు రీడిజైన్‌ చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసారని ఆరోపించారు.

2.8 టీఎంసీల నిల్వ సామర్థ్యం

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో 6వ రిజర్వాయర్‌ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు 670 మీటర్ల అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించబోతున్నామని, ఈ రిజర్వాయర్‌ సామర్థ్యం 2.8 టీఎంసీలు ఉంటుందని ఇరిగేషన్‌ ఈఈ దయానంద్‌ అన్నారు. ఇందుకు 1,512.35 ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. ఆర్‌ఎన్‌ఆర్‌ ల్యాండ్‌ అక్విజేషన్‌ కమిషనర్‌ శివశంకర్‌ నాయుడు మాట్లాడుతూ.. వికారాబాద్‌ జిల్లాలోని సయ్యద్‌పల్లి, అల్లాపూర్‌కు సంబంధించి 1,234 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలో 278.35 ఎకరాల భూమి ప్రాజెక్టు నిర్మాణంలో పోతుందన్నారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, వెంకటాచారి, షాద్‌నగర్‌ ఆర్డీఓ సరిత, అధికారులు ఏఎస్‌ఎన్‌ రెడ్డి, జగదీశ్వర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి, సర్పంచ్‌ మోహనాచారి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షలు చంద్రశేఖర్‌, పురుషోత్తం రెడ్డి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement