మొయినాబాద్‌రూరల్: ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన బస్‌షెల్టర్‌ను లయన్స్‌క్లబ్ జిల్లా గవర్నర్ అమర్నాథ్‌రావు, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్, కేజీ రెడ్డి కళాశాల డైరెక్టర్ రోహిత్‌రెడ్డి ప్రారంభించారు. రెండు నెలల క్రితం నక్కలపల్లిలో బస్‌షెల్టర్ నిర్మించేందుకు పంచాయతీ ఆధ్వర్యంలో కేజీరెడ్డి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో లయన్స్ క్లబ్ సంయుక్తంగా భూమిపూజ చేశారు. పనులు పూర్తి కావడంతో బుధవారం ఈషెల్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యర్ధాల సేకరణ డ్రైవ్‌లో భాగంగా ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసి బస్‌షెల్టర్ నిర్మాణానికి వినియోగించామన్నారు. ఈ షెల్టర్ 500 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందన్నారు. 240 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా తయారు చేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని చర్లపల్లి జైలులో మాత్రమే ఇలాంటి షెల్టర్ ఉందని చెప్పారు. దీని నిర్మాణానికి రూ.2.50లక్షల ఖర్చు చేసినట్లు వివరించారు. సమస్యలకు స్థిరమైన వినూత్న పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కేజీరెడ్డి కళాశాల టెక్నాలజీ ప్రోగ్రాం అధికారి సంయుక్త తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కలపల్లి సర్పంచ్ యాదయ్య, ఉపసర్పంచ్ నిరంజన్‌గౌడ్, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, వాయిస్ జిల్లా గవర్నర్ పద్మావతి త్రిపురనేని, సెక్రటరీ రిందాదేవి, ఇందిర అల్లూరి, కరుణ, సీతాదేవి, కేజీరెడ్డి కళాశాల జయహరి, లింగం, రవికుమార్, శేషప్ప, మోహన్, వెంకట్, సాయికృష్ణ, లక్ష్మణ్, సచిన్, ప్రవీణ్, ప్రీతి, నిహారిక పాల్గొన్నారు.
500 ఏళ్ల వరకు 240 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా తయారీ


