చిన్నారులకు పలకల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు పలకల పంపిణీ

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

చేవెళ్ల: అంగన్‌వాడీ ద్వారా ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్‌ మనీషాఅనంత్‌రెడ్డి అన్నారు. అంగన్‌వాడీ–4లో మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిల్లలకు బట్టలు, పలకలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, గర్భిణులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్‌ భారతి, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

పరేడ్‌లో చేవెళ్ల ఫైర్‌ పైటర్‌

చేవెళ్ల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పరేడ్‌లో చేవెళ్ల అగ్నిమాపక కేంద్రం ఫైర్‌ పైటర్‌ ఉప్పరి గోపాల్‌కు అవకాశం లభించింది. మంగళవారం సిక్రింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఆర్ముడ్‌ ఫోర్స్‌ నిర్వహించిన పరేడ్‌లో గోపాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల అగ్నిమాపక కేంద్రం అధికారి రవీందర్‌రెడ్డి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి అవకాశాలు రావడం సంతోషకరమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement