ఉపాధి కల్పనే! | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనే!

May 19 2025 7:59 AM | Updated on May 19 2025 7:59 AM

ఉపాధి

ఉపాధి కల్పనే!

సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025

8లోu

సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో జిల్లా ఉపాధి కల్పనశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల అవసరాల మేరకు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించడంతో పాటు ఎప్పటికప్పుడు జాబ్‌మేళాలు నిర్వహించాల్సిన అధికారులు అటువైపు దృష్టి సారించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నోటిఫికేషన్లు భారీగా తగ్గడం, నిరుద్యోగుల నిష్పత్తి కంటే చాలా తక్కువ పోస్టులను భర్తీ చేస్తుండటం, ఒక్కో పోస్టుకు వేల సంఖ్యలో పోటీ పడుతుండటం వెరసి.. టెన్త్‌, ఆపై తరగతులు పూర్తి చేసుకున్న వారు ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫీసులో పేరు నమోదుకు ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది 751 మందికి మించి పేర్లు నమోదు చేసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పెద్దగా పని లేకుండా పోయింది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇక్కడి ఉద్యోగులకు నిరుద్యోగ యువతకు స్కిల్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఇప్పించడం, జాబ్‌మేళాలు నిర్వహించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి పనులు అప్పగించింది. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై), దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన (డీడీయు–జీకేవై) పథకాల కిం ద నిరుద్యోగ యువతకు వివిధ అంశాలపై శిక్షణ ఇప్పించాల్సి ఉన్నా.. ఐదేళ్లుగా ఏ ఒక్కరికీ శిక్షణ ఇచ్చింది లేదు.

ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల సేవలో..

జిల్లాలో అనేక చిన్నతరహా, మధ్య తరహా, భారీ పరిశ్రమలతో పాటు ఐటీ అనుబంధ కంపెనీలు, ఆస్పత్రులు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయి. వీటికి సెక్యూరిటీ సహా పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది అవసరం. మెజార్టీ సంస్థలు నేరుగా కాకుండా ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నాయి. జిల్లా ఉపాధి కల్పనశాఖ నుంచి లైసెన్స్‌ పొందిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తుంటారు. ఇందుకోసం 2021లో జిల్లా ఉపాధి కల్పన శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 86 ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు పేర్లు నమోదు చేసుకున్నాయి. ఈ సమయంలో ఒక్కో ఏజెన్సీ రూ.లక్ష చొప్పున ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ వద్ద డిపాజిట్‌ చేసింది. వీరిలో కేవలం 36 ఏజెన్సీలకు ఉపాధి కల్పించింది. అడిగినంత ముట్ట జెప్పిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తూ..మిగిలిన వారికి నిరాకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉపాధి కల్పనశాఖ ద్వారా పనులు దక్కని ఏజెన్సీలు తాము కట్టిన డీడీ మొత్తాన్ని తమకు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరినా పట్టించుకోవడం లేదు. దీంతో సెట్విన్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకుడు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆయనకు రూ.లక్ష చెక్కు రాసిచ్చారు. తీరా బ్యాంకులో డిపాజిట్‌ చేయగా అకౌంట్‌లో నగదు లేక చెక్కు బౌన్స్‌ కావడంతో సదరు ఏజెన్సీ నిర్వాహకుడు ఆందోళన చెందాడు. ఇదే అంశాన్ని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టి ంచుకోవడం లేదు.

న్యూస్‌రీల్‌

జిల్లా ఉపాధి కల్పనశాఖ నిర్లక్ష్యం

యువతకు శిక్షణ ఇప్పించడంలో విఫలం

జాబ్‌మేళాల నిర్వహణ శూన్యం

2021లో 86 ఏజెన్సీలు దరఖాస్తు

36 ఏజెన్సీలకే పని కల్పించిన వైనం

నిరుత్సాహంలో నిరుద్యోగ యువత

పర్యవేక్షణ లోపం

ఇదిలా ఉంటే ప్రభుత్వ విభాగాలాన్నీ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొంగరలో రూ.50 కోట్లకుపైగా వెచ్చించి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని నిర్మించింది. అప్పటి వరకు లక్డీకాపూల్‌లో ఉన్న కలెక్టరేట్‌ సహా కీలక విభాగాలన్నింటినీ రెండేళ్ల క్రితమే కొంగరకు తరలించింది. జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం మాత్రం ఇప్పటికీ మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లోనే కొనసాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పని దినాల్లోనూ వీరు ఆఫీసులో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు లేకపోలేదు.

ఉపాధి కల్పనే!1
1/1

ఉపాధి కల్పనే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement