‘మెగా వెంచర్‌’ | - | Sakshi
Sakshi News home page

‘మెగా వెంచర్‌’

Apr 9 2025 7:23 AM | Updated on Apr 9 2025 7:23 AM

‘మెగా

‘మెగా వెంచర్‌’

మహిళా ఆరోగ్యంతోనే.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాల్లో సంతోషం ఉంటుందని ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్‌ సీడీపీఓ వినితాదేవి అన్నారు.
వడివడిగా

8లోu

ఫార్మాసిటీ లబ్ధిదారులకు పరిహారం ప్లాట్లు

చివరి దశకు చేరిన నిర్మాణ పనులు

త్వరలో పంపిణీ చేస్తామని చెబుతున్న అధికారులు

కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ(గతంలో ఫార్మాసిటీ) నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారంతో పాటు అదనంగా కేటాయించనున్న ప్లాట్లకు సంబంధించి చేపట్టిన మెగా వెంచర్‌ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. లబ్ధిదారులకు పంపిణీ చేయడమే మిగిలింది.

ఎకరాకు 121 గజాలు

అప్పటి ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం కందుకూరు, యాచారం, కడ్తాల్‌ మండలాల పరిధిలో 19,333 ఎకరాలు సేకరించడానికి నిర్ణయించింది. కందుకూరు, యాచారం మండలాల్లో 14 వేల ఎకరాల వరకు సేకరించింది. అందులో కోర్టు కేసులు, ఇతర సమస్యలు పోను ఎలాంటి వివాదాలు లేని భూములు సుమారు 12 వేల ఎకరాల వరకు ఉంటాయి. అప్పట్లో ఆయా భూములకు పరిహారం చెల్లించడంతో పాటు అదనంగా ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాటు ఇవ్వడానికి నిశ్చయించి సర్టిఫికెట్లు సైతం జారీ చేశారు. కందుకూరు మండలం పంజుగూడ రెవెన్యూలో సేకరించిన భూమికి రైతులకు ఇవ్వాల్సిన 155 ప్లాట్లకు గాను 128 ప్లాట్లకు, మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో 702 ప్లాట్లకు గాను 513 ప్లాట్లకు, ముచ్చర్ల రెవెన్యూలో 725 ప్లాట్లకు గాను 597 ప్లాట్లకు సంబంధించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. యాచారం మండలం కుర్మిద్ధ రెవెన్యూలో 1,236 ప్లాట్లకు గాను 514 ప్లాట్లకు, నానక్‌నగర్‌ రెవెన్యూలో 359 ప్లాట్లకు గాను 158 ప్లాట్లకు, తాడిపర్తి రెవెన్యూలో 543 ప్లాట్లకు గాను 278 ప్లాట్లకు, మేడిపల్లి రెవెన్యూలో 1,600 ప్లాట్లకు గాను 1,182 ప్లాట్లకు సంబంధించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. లబ్ధిదారులకు కేటాయించడానికి మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో బేగరికంచె పంచాయతీ సమీపంలో 622 ఎకరాల విస్తీర్ణంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో మెగా వెంచర్‌ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రోడ్లపై తారు వేసే పనులు కొనసాగుతున్నాయి. ప్లాట్లుగా విభజించి హద్దు రాళ్లు సైతం పాతారు. వాటిపై ప్లాట్ల నంబర్లు రాయించారు. ఇక లబ్ధిదారులకు కేటాయించడమే తరువాయి.

పాట్లు లేకుండా ప్లాట్లు కేటాయించేలా..

కాగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్లాట్లను కేటాయించడానికి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించి ఎన్ని ప్లాట్లు ఉంటే అన్నీ ఒకే దగ్గర ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి నెల రోజుల క్రితం ఆయా గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారుల వివరాలను అందుబాటులో ఉంచారు. లబ్ధిదారుల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు సేకరించారు. వాటి ఆధారంగా వారికి ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు.

‘ఫార్మా’ భూములకు ముమ్మరంగా ఫెన్సింగ్‌

యాచారం: ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం నక్కర్తమేడిపల్లి నుంచి ప్రారంభమైన సర్వే, ఫెన్సింగ్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నక్కర్తమేడిపల్లి, పల్లెచల్కతండా, నానక్‌నగర్‌ గ్రామం నుంచి తాడిపర్తి గ్రామ శివారు వరకు సర్వే పూర్తయింది. ఇప్పటి వరకు 19 కిలోమీటర్ల సర్వే, 9 కిలోమీటర్ల బౌండరీ, 4 కిలోమీటర్ల ఫెన్సింగ్‌ నిర్మాణ పనులు పూర్తి చేశారు. రాచకొండ అడిషనల్‌ డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. కాగా, నక్కర్తమేడిపల్లి–నానక్‌నగర్‌ గ్రామాల మధ్య కొనసాగుతున్న ఫార్మాసిటీ భూముల సర్వేను మంగళవారం టీజీఐఐసీ ఈడీ పవన్‌కుమార్‌, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రావణ్‌కుమార్‌ తదితరులు పరిశీలించారు. సర్వే, ఫెన్సింగ్‌ నిర్మాణ పనుల్లో భాగాస్వామ్యమైన సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు.

త్వరలో రిజిస్ట్రేషన్లు

రైతులకు కేటాయించిన ప్లాట్లకు సంబంధించి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు పొందిన రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయడానికి చూస్తున్నాం. ఒక కుటుంబానికి ఒకే దగ్గర ప్లాట్లను కేటాయించేలా పరిశీలిస్తున్నాం. వారి నుంచి అభిప్రాయాలు సేకరించి ప్లాట్ల పంపిణీ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తాం.

– జగదీశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ, కందుకూరు

‘మెగా వెంచర్‌’ 1
1/2

‘మెగా వెంచర్‌’

‘మెగా వెంచర్‌’ 2
2/2

‘మెగా వెంచర్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement