వారం రోజుల్లో ‘డబుల్’ ఇళ్లు
మంచాల: లబ్ధిదారులకు వారం రోజుల్లో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేస్తామని ఇబ్రహీపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని లింగంపల్లి గేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పంపిణీకి ముందే నివాస యోగ్యానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఉప్పరిగూడ పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, ఎంపీడీఓ బాలశంకర్, తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, హౌసింగ్ ఏఈ రాంచంద్రయ్య, నాయకులు కొంగర విష్ణు వర్ధన్‌రెడ్డి, ఎడ్మా నరేందర్‌రెడ్డి, జెనిగె వెంకటేశ్, మల్లేష్, మూర్తి, ఐలయ్య, కరుణాకర్‌రెడ్డి, భరత్‌రెడ్డి, రవి, రాజేశ్, ఆర్‌ఐ రమేశ్ పాల్గొన్నారు.
ఇబ్రహీపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి


