రౌడీ షీటర్‌కు నగర బహిష్కరణ
మీర్‌పేట: పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ రౌడీషీటర్‌కు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మీర్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆరాంఘర్‌కు చెందిన సురేందర్ అలియాస్ సూరి (36) రౌడీషీటర్. ఇతనిపై మీర్‌పేటతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 40 కేసులు నమోదై ఉన్నాయి. ఏడాది క్రితం మీర్‌పేటలో సల్మాన్ అనే యువకుడిని హత్య చేయడంతో పాటు కట్టుకున్న భార్యను కూడా హతమార్చాడు. ఇటీవల చైతన్యపురి పీఎస్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇతని వల్ల మరికొందరికి ప్రాణహాని ఉందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు 261 సిటీ యాక్ట్ ప్రకారం సురేందర్‌ను నగర బహిష్కరణ చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. సురేందర్ కమిషనరేట్ పరిధిలో ఉండకూడదని, ఒకవేళ రావాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆదేశించారు.
రౌడీ షీటర్‌కు నగర బహిష్కరణ


