వర్సిటీ భూములను కాపాడుకుందాం
చేవెళ్ల: వర్సిటీ భూములను, పర్యావరణాన్ని, విద్యార్థుల హక్కులను కాపాడే దిశగా ఉద్యమం కొనసాగిస్తామని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేశ్, చేవెళ్ల బీజేపీ మండల అధ్యక్షుడు అనంత్‌రెడ్డిలు అన్నారు. గురువారం మండలకేంద్రంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ పిలుపు మేరకు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిరంకుశ విధానాలు తిప్పి కొట్టేందుకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. హెచ్‌సీయూ భూములను లాక్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియను ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకుడు డాక్టర్ వైభవ్‌రెడ్డి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి, బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రాజమల్లేశ్, శివకుమార్, ప్రవీణ్, భాస్కర్, శ్రీనివాస్, మధూకర్‌రెడ్డి, శ్రీనివాస్, బి.కృష్ణ, నితీష్‌రెడ్డి, శివకుమార్‌గౌడ్, రిషికేశ్, రాజు, మైసూరారెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్, మహేశ్, సాయి, శ్రీరాములు, శ్యామ్, కిరణ్ పాల్గొన్నారు.
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేశ్


