కరెంటు కోతలు.. కన్నీటి రాతలు
ఆమనగల్లు: యాసంగి పంటకు సాగునీరు కష్టాలు మొదలయ్యా యి. ఓ వైపు అడుగంటిన భూ గర్భ జలాలు.. మరో వైపు వి ద్యుత్ కోతల కారణంగా పంట లు కాపాడుకునేందుకు రైతు చే యని ప్రయత్నం లేదు. బోర్లలో నీరు ఉండడం, సన్నాల కు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ .500 బోనస్ ప్రకటించడంతో రైతులు వరిసాగుపై మక్కువ చూపారు. పంటసాగు ప్రారంభంలో వ్యవసాయ బోర్లలో నీరు బాగానే ఉండటంతో రైతులు పంటలు సాగుచేశారు. ప్రస్తుతం బోర్లలో నీటిమట్టం తగ్గి, సాగుచేసిన పంటలకు నీరు అందకపోవడంతో వరి ఎండిపోతోంది. బోర్లలో నీటిమట్టం తగ్గడంతో పాటు కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో పలువురు రైతులు సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి.
ఎకరానికి పైగా ఎండిపోయింది
మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశాను. వ్యవసాయ బోరు మొదట్లో నీరు బాగానే పోసినప్పటికీ నీటిమట్టం తగ్గడంతో ఇటీవల నీరు అందడం లేదు. ఇప్పటికే ఎకరానికి పైగా పంట ఎండిపోయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి.
– శ్రీనివాస్‌రెడ్డి, రైతు, చింతలపల్లి


